ఆరోగ్య శాఖను ఎందుకు విలీనం చేశారో, ఎందుకు విడగొట్టారో తెలియడం లేదని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. 10 పథకం ప్రజలకు చాలా అవసరం, ఆ పథకంలో ప్రభుత్వం విఫలమవుతోందని చెప్పడం తప్పా అని పేర్కొన్నారు. మంత్రి వర్గంలో చర్చించకుండానే రూపాయి కిలో బియ్యం పథకాన్ని సీఎం తిరుపతిలో ప్రకటించారు అని చెప్పారు. రూపాయి కిలో బియ్యం పథకంపై వస్తున్న విమర్శలనే సీఎంకు చెప్పానని తెలిపారు. పథకాల్లో లోపాలు ఉంటే ఎత్తి చూపడం తప్పా అని ప్రశ్నించారు. తాను ఏవరికి చెంచాగిరి చేయానని ఆయన తేల్చి చెప్పారు. సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై అధిష్టానానికి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. ఆరోగ్య శాఖను విడగొట్టి తనపై బరువు తగ్గించడం వలన సంతోషంగా ఉందన్నారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఏ ఒక్కరికి కొమ్ముకాయను అని, ఒక పార్టీ కార్యకర్తగా మాత్రమే పని చేస్తానని చెప్పారు.