తెలంగాణ ఉద్యోగులతో ఒప్పందం చేసుకున్న హామీలను కిరణ్ సర్కార్ ఉల్లఘించినందున తెలంగాణ ఉద్యోగులు ఉద్యమానికి మళ్లీ సన్నద్ధం కాబోతున్నారు. తెలంగాణ ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని టీఎన్జీవో అధ్యక్షుడు స్వామిగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు తమ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాయి. మార్చి 20న ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమం ఉంటుందని స్వామిగౌడ్ తెలిపారు. అదే రోజున హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. ర్యాలీలో సర్కార్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 21న భోజన విరామ సమయంలో నిరసనలు, 25న జిల్లాల్లో ర్యాలీలు, మార్చి 3న జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, 5 నుంచి వర్క్ టూ రూల్స్ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇక నుంచి సర్కార్ బెదిరింపులకు భయపడేదే లేదని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి.