కేబినెట్ నిర్ణయాలకు మంత్రులదే సమిష్టి బాధ్యత అని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వంపై బురద జల్లటానికి అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన.... అవినీతి అంశాల్లో మంత్రులకు సంబంధం ఉంటే వారినీ శిక్షించాలన్నారు. మద్యం సిండికేట్లపై ఏసీబీ దాడులు చిత్తూరు జిల్లాలో జరగలేదంటే చంద్రబాబుతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్లేనా అని బొత్స ఎదురు ప్రశ్నించటం విశేషం.
బీసీ మంత్రులకు సరైన శాఖలు దక్కలేదన్న ప్రకటనకు తాను కట్టుబడి ఉంటానని ఆయన పునరుద్ఘాటించారు. చిరంజీవికి సీఎల్పీ డిప్యూటీ లీడర్ పదవి ఇస్తే తప్పేంటని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు స్టే తెచ్చుకున్నారని, లేకుంటే జైల్లో ఉండేవారని ఆయన అన్నారు.