సమ్మక్క - సారలమ్మల జాతర సందర్భంగా మేడారంలో భద్రత కట్టుదిట్టం చేశామని వరంగల్ ఎస్పీ రాజేష్‌కుమార్ పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం వేల మంది పోలీసులను విధుల్లో ఉంచామని తెలిపారు. జాతరలో నకిలీ వస్తువులను అడ్డుకునేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. జాతరను 3 సెక్టార్లుగా విభజించి జిల్లా స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించామని కలెక్టర్ రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. తప్పిపోయిన వారి కోసం ప్రత్యేక స్క్రీన్‌లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని 41 ప్రాంతాల నుంచి 3,150 బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు.