కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ఆదర్శ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సోమవారం వెలువడింది. డీఎస్సీ ద్వారా 7,100 ఉపాధ్యాయులను భర్తీ చేయనుంది. ప్రిన్సిపాల్స్, పీజీ ఉపాధ్యాయులు, ట్రైనీ గ్రాడ్యుయేట్‌లను భర్తీ చేయనున్నారు. ట్రైనీ గ్రాడ్యుయేట్‌కు ‘టెట్’ ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ నెల 29 నుంచి మార్చి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మే 10, 11న రాత పరీక్షలు జరగనున్నాయి