పార్టీ కోసం పని చేసిన వారికి కాంగ్రెస్‌లో గుర్తింపు లేదని ఆముదాలవలస ఎమ్మెల్యే సత్యవతి అన్నారు. తమ కుటుంబం పార్టీ కోసం 32 ఏళ్లుగా కృషి చేస్తున్న మంత్రి పదవి రాకపోవడం కలిచి వేసిందన్నారు. ఇక కాంగ్రెస్‌లో కొనసాగడం వృథా అని ఆమె పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరి ఉంటే కాంగ్రెస్ బతిమాలి మంత్రి పదవి లేదా సూట్‌కేసు ఇచ్చి ఉండేదని ఆమె తెలిపింది. పార్టీని నమ్ముకున్నందుకు చివరకు నిరాశే మిగిలిందన్నారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ఆమె స్పష్టం చేసింది.