అవినీతి అంశంలో మంత్రులను కూడా విచారించాలన్న ఐఏఎస్‌ల డిమాండ్‌ను పీసీసీ చీఫ్, మంతి బొత్స సత్యనారాయణ సమర్ధించారు. క్యాబినెట్ నిర్ణయాలకు మంత్రులదే బాధ్యత అని బొత్స తెలిపారు. తప్పు చేస్తే మంత్రులైనా.. అధికారులైనా ఒకటేనని ఎవరికీ మినహాయింపులు ఉండవన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణల విషయంలో విచారణకు సిద్ధపడకుండా... కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్న చంద్రబాబుకు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని బొత్స మండిపడ్డారు.