బోధనా రుసుముల చెల్లింపులో ప్రభుత్వ జాప్యానికి నిరసనగా ఫిబ్రవరి 7 నుంచి కళాశాలలు మూసివేయాలని ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు నిర్ణయించాయి. కళాశాలల మూసివేతకు మైనార్టీ కళాశాలల యాజమాన్యాలు కూడా మద్దతిచ్చాయి. ఫీజు రియంబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం చిన్న చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాయి. జనవరి 1న నోటిసులు ఇచ్చిన కూడా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తక్షణమే రూ. 4 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి.