మార్చి తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో పార్టీ కార్యకర్తల భేటీలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ప్రతి మండలంలో రెసిడెన్సియల్ పాఠశాలల ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రత్యేక తెలంగాణలో 40 సింగరేణి గనుల ఏర్పాటు చేసి 50 వేల మందికి ఉపాధి కలిపిస్తామని చెప్పారు. అన్ని విభాగాల్లో ఉన్న కాంట్రాక్ట కార్మికులను పర్మినెంట్ చేస్తామని చెప్పారు.