మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్‌తో ఆమోదముద్ర వేయించుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న సోనియా, ఆజాద్, అహ్మద్‌పటేల్‌తో విడివిడిగా సమావేశమయిన ఆయన తన ప్రతిపాదనను వారి ముందు ఉంచినట్టు తెలిసింది. తెలంగాణ ప్రాంతంలో ఏర్పడిన మూడు ఖాళీల భర్తీతో పాటు శాఖల మార్పిడికి అనుమతివ్వాలని వారిని కోరినట్టు సమచారం. ఇంకా చర్చలు పూర్తికానందున సీఎం ఢిల్లీలోనే ఉండిపోయారు. ఈరోజు కూడా అధిష్టానం పెద్దలతో ఆయన చర్చలు సాగింగే అవకాశముంది. మరోసారి ఆజాద్‌ను కలిసి ఈ కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు సీఎం కిరణ్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.