బేగంపేట ఐఏఎస్‌ల సంఘం కార్యాలయంలో భేటీ అయిన ఐఏఎస్‌ల సమావేశం వాడివేడిగా జరిగినట్లు సమాచారం. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కార్యదర్శులు సహా 100 మంది ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. సీబీఐ జేడీ లక్ష్మినారాయణ తీరుపై ఐఏఎస్‌లు నిప్పులు చెరిగినట్లు తెలుస్తోంది. ఐఏఎస్‌లను విచారించే ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి తీసుకోవాలని సీబీఐకి తెలియదా అని ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు ఐఏఎస్‌లను విచారిస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసే ఆలోచనలో ఐఏఎస్‌లు ఉన్నట్లు సమాచారం.