ఐదు దశాబ్దాల కిందటే తెలంగాణ అవశ్యకతను గుర్తించిన వ్యక్తి ప్రొ. జయశంకర్ అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు అన్నారు. మదీనా సెంటర్‌లో ప్రొ. జయశంకర్ విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దిక్కు తోచని స్థితిలో ఉన్న తెలంగాణ ప్రజలకు మార్గదర్శకులుగా ప్రొ. జయశంకర్ నిలిచారని తెలిపారు. ఆంధ్రుల దోపీడిని అడగడుగునా ఎండగట్టి, తెలంగాణకు జరిగినా అన్యాయాలను పుస్తక రూపంలో తీసుకువచ్చిన ఘనత జయశంకర్‌కే దక్కుతుందన్నారు. ఉద్యమ ఉధృతి కోసం నిర్విరామ కృషి చేశారని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై జయశంకర్ క్యాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, పాఠ్య పుస్తకాలలో ఆయన జీవిత చరిత్రను ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు లెక్చరర్లకు, 104 ఉద్యోగులకు తమ పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. లక్ష ఉద్యోగాల పేరుతో సీఎం నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. మొదటగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు.