* సీబీఐ కేసులు, దర్యాప్తులో వేధింపులపై చర్చ
* మీటింగ్‌కి హాజరైన 20 మంది ఐఏఎస్‌లు
* ప్రధానికి లేఖ రాసే అవకాశం?
* సిబిఐ ముందు ఐఏఎస్ కుటుంబాలు నిరసన తెలిపే అవకాశం ?
ఎమ్మార్ ప్రాపర్టీస్, గనుల అక్రమ తవ్వకాలు, జగన్ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి సీబీఐ వరుస అరెస్ట్‌లతో ఐఏఎస్ అధికారులు భగ్గమంటున్నారు. రాజకీయ పార్టీల వేదింపులు, వారి అక్రమ ఆర్జనల నేపథ్యంలో ఎంతో ఉన్నత విలువలతో కూడిన ఐఏఎస్ వంటి పదవులకు అపకీర్తి తేవడం ఎంత మాత్రం సరికాదని ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ భావిస్తోంది.
దీంతో రాష్ట్రంలో సిబిఐ దురుసు వైఖరిపై ఇవాళ సమావేశంలో మరో మారు చర్చించి ప్రధాని మన్మోహన్ సింగ్ కు ప్రత్యేకంగా లేఖ రాయాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే కుటుంబసభ్యులతో కలిసి తమ నిరసనను అటు సిబిఐకి, ..ఇటు ప్రభుత్వానికి కూడా తెలియజేయడానికి వెనుకంజ వేయకూడదని పలువురు రిటైర్డ్ ఐఏఎస్‌లు సూచించినట్లు సమాచారం.