గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తెలియజేశారు. గల్ఫ్ టీజీ సంక్షేమ సంఘం సహకారంతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మూడు చోట్ల కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్‌లలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని ఆమె శుక్రవారం కరీంనగర్‌లో తెలిపారు.
ప్రవాసాంధ్రుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు సొంతజిల్లా కరీంనగర్ కలెక్టరేట్‌లో గల్ఫ్ బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, హెల్ప్‌లెస్‌గా మారిందని కవిత విమర్శించారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా తెలంగాణ జాగృతి హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా గల్ఫ్ బాధితుడు రవీందర్ గల్ఫ్ కష్టాలకు పాటల రూపమిచ్చాడు.