ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. వందలాది మంది విద్యార్థులపై కేసులుపెట్టి ఉద్యమాన్ని అణచివేసేందుకు సర్కారు యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఈనెల 11న జరగనున్న బీజేపీ పోరుయాత్ర బహిరంగసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.