రాష్ట్రంలో చేనేత రుణాలు 27 కోట్ల రూపాయలను మాఫీ చేస్తూ ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేశారు. జిల్లా కో ఆపరేటీవ్ సెంట్రల్ బ్యాంక్‌లకు ఈ మెత్తాన్ని విడుదల చేస్తారు. 2010 మార్చి 31 వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత రుణాలు 23 కోట్లు, మిగితా నాలుగు కోట్లు జిల్లా ప్రాథమిక సహాకార సంఘాలు తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయి.