కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ దొంగ కంపెనీలను సృష్టించి రూ. 13 వేల కోట్లు దోచుకున్నారని టీఆర్‌ఎస్ నేత డా. శ్రవణ్ తెలిపారు. ఒక్క కంపెనీకి 9 ప్రాజెక్టులు ఎట్ల కేటాయిస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే లగడపాటిపై సుమోటో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై పోరాడితే కేంద్ర బహుమతి ఇచ్చిందా అని ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించక పోతే తామే సీబీఐకి లేఖ రాస్తామని ఆయన స్పష్టం చేశారు.