జూనియర్ డాక్టర్ల సమస్యలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి స్పందించారు. జూడాలకు ఉపకార వేతనం రూ. 5 వేలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. తక్షణమే జూడాలు ఆందోళనలు విరమించుకోవాలని కోరారు. ఇతర డిమాండ్లను కూడా త్వరలోనే నెరవేరుస్తామని ఆయన పేర్కొన్నారు.