ఎమ్మార్ కేసులో 1000 పేజీలతో కూడిన చార్జిషీటును కోర్టుకు దాఖలు చేశామని సీబీఐ జేడీ లక్ష్మినారాయణ తెలిపారు. 6 పెట్టెల్లో అభియోగ పత్రాలు కోర్టుకు తరలించారు. ముగ్గురు నిందితులపై చార్జిషీటు దాఖలు చేశామని చెప్పారు. కోనేరు ప్రసాద్, కోనేరు మధు, బీపీ ఆచార్య, విశ్వేశ్వరరావులతో పాటు మరి కొందరి పేర్లు చార్జిషీటులో ఉన్నాయి. బీపీ ఆచార్య ఆరోగ్యం నిలకడగా ఉందని సీబీఐ జేడీ పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు 250 మందిని సీబీఐ విచారించింది. 2,300 పైగా డాక్యుమెంట్లను సీబీఐ సేకరించింది.