తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన మాటను కట్టుబడి ఉండకుంటే ఆ పార్టీ పతనం ఖాయమని జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం అన్నారు. జేఏసీ కార్యాలయంలో చలో ఓయూ విద్యార్థి గర్జన గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణపై కాంగ్రెస్ పూటకో మాట మాట్లాడుతుందని నిప్పులు చెరిగారు. తెలంగాణను మోసం చేస్తున్న పార్టీలకు ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ఎక్కువ కాలం మోసం చేయలేదని పేర్కొన్నారు.