వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా సకల జనుల సమ్మె కాలంలో తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామని తేల్చి చెప్పారు. విద్యార్థులపై, ఉద్యమకారులపై తక్షణమే కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార మత్తులో జోగుతున్నారే తప్ప సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.