హైదరాబాద్ మినహా తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు కొనసాగుతున్నాయి. విద్యార్థులపై, ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టరేట్‌ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.