అంబేద్కర్ విగ్రహాల విధ్వంసాన్ని రాష్ట్ర మంత్రి వర్గం ఖండించింది. విగ్రహాల విధ్వంసంనకు పాల్పడిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని కొందరు మంత్రులు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొత్త చట్టాన్ని రూపొందించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. ధ్వంసంమైన విగ్రహాల స్థానంలో క్యాంస విగ్రహాలను ఏర్పాటు చేయాలని కేబినేట్ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మళ్లుతున్నాయని దళిత మంత్రులు కేబినేట్‌లో ప్రస్తావించారు.