జగన్ వర్గ ఎమ్మెల్యేలపై 48 గంటల్లో వేటు పడే అవకాశం ఉందని ప్రభుత్వ విప్ కొండ్రు మురళి పేర్కొన్నారు. 16 మందిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరామని తెలిపారు. స్పీకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పామన్నారు. రెండు రోజుల తర్వాత స్పీకర్ తన తీర్పుని వెల్లడిస్తారని ఆయన చెప్పారు.