2012 డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డిఎస్సి) నోటిఫికేషన్ని 21వేల 334 ఉపాధ్యాయ పోస్టులతో విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్లో 5703 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, రెండు వేల భాషా పండితుల పోస్టులు, 365 ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ పోస్టులు, 1672 మునిసిపల్ పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి.
మే 2న డిఎస్సి రాత పరీక్ష నిర్వహిస్తారు. మే 3న స్కూల్ అసిస్టెంట్ రాత పరీక్ష, మే 4న ఎస్టిసి, పిఇటి, ఎస్ఎ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ సారి అందరూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే నెల 16 నుంచి మార్చి 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ డిఎస్సి నుంచి అప్రంటీస్ విధానంని రద్దు చేశారు.