జూనియర్ డాక్టర్లను చర్చలకు పిలవలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు. చర్చలకు వచ్చిన జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులను సచివాలయం లోపలకు అనుమతించలేదు. అనుమతిలేదని సచివాలయం బయటే వారిని భద్రతా సిబ్బంది నిలిపివేశారు. చర్చలకు వారిని ఆహ్వానించలేదని, మంత్రి మండలి ఉపసంఘం వారితో చర్చలు జరుపుతుందని మంత్రి డిఎల్ చెప్పారు. సమ్మెకు సంబంధించి అన్ని విషయాలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వివరించినట్లు మంత్రి తెలిపారు.