ఎమ్మార్ కేసులో ప్రధాన నిందితుడు హోం శాఖ కార్యదర్శి బీపీ ఆచార్యను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద 13/1, 13/2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎమ్మార్ కేసులో ఆచార్యది నాలుగో అరెస్టు. గతంలో ఏపీఐసీసీ ఎండీగా పని చేశారు. కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.