హామీ ఇచ్చిన మేరకు తెలంగాణ విద్యార్థులు, ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అన్నారు. సోమవారం ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నివాపంలో తెలంగాణ ప్రాంత ఎంపీలు భేటీ అయ్యారు.
ఐదు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ఉన్నందున త్వరలోనే మరోసారి సమావేశమై చర్చించి, భవిష్యత్ ప్రణాళిక ప్రకటించి ఐక్యపోరాటాలకు సిద్దమవుతామన్నారు. తెలంగాణ ద్రోహుల ఇంటికి ఉద్యోగ సంఘాల నేతలు వెళ్లడం సరికాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమం , వాదం వెనక్కి తగ్గిందనడం సరికాదన్నారు. తెలంగాణ వాదులంతా ఏకం కావాలని టి కాంగ్రెస్ ఎంపీలు పిలుపునిచ్చారు.