దివంగత దర్శకుడు ఇవివి సత్యనారాయణ కుమారుడు, నటుడు ఆర్యన్ రాజేష్ నిశ్చితార్థ వేడుక తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడులో సోమవారం ఘనంగా జరిగింది. ఈ గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ కంటిపూడి అమరనాథ్ కుమార్తె సుభాషిణిని రాజేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు అల్లరి నరేష్, ఉదయ కిరణ్, వెంకట్, బాలాజీ, చలపతిరావు, ఎల్.బి శ్రీరామ్, ఎంఎస్ నారాయణ, జీవా తదితరులతో పాటు జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు మాగంటిబాబు, గోరంట్ల బచ్చయ్య చౌదరి తదితరులు హాజరయ్యారు.