: జూనియర్ డాక్లర్ల నిరాహార దీక్షలు ఆరోరోజుకు చేరుకున్నాయి. దీక్షలో ఉన్నవారి ఆరోగ్యం క్షీణిస్తున్నా సర్కారు మాత్రం స్పందించపోడంపై జూడాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీక్ష చేస్తున్న వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
జూనియర్ డాక్టర్లు కేవలం స్టైఫండ్ పెంచుకోవడానికే సమ్మె చేస్తున్నారని ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని వారు మండి పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, అత్యవసరమైన మందుసామాగ్రి అందుబాటులోకి తేవాలనేది తమ పదకొండు డిమాండ్లలో ముఖ్యమైనదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు