మద్యం సిండికేట్లపై దాడులకు సంబంధించి ఎసిబి 750 పేజీల నివేదికని కోర్టుకు సమర్పించింది. ఈ నెల 27న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వరంగల్ జిల్లాలలో మద్యం సిండికేట్లపై ఎసిబి అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఎసిబి సమర్పించిన నివేదిక ప్రకారం దాడుల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో దొరికిన ఆధారాలతోనే ఎసిబి అధికారులు మళ్లీ దాడులు కొనసాగిస్తారు. ముడుపులు ఇచ్చిన, పుచ్చుకున్న 11 మంది వ్యాపారులను, 8 మంది ఎక్సైజ్ సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ అధికారులకు మద్యం సిండికేట్లు భారీగా ముడుపులు ఇచ్చాయి. కొంతమంది పోలీస్ అధికారులకు కూడా సిండికేట్ ముడుపులు చెల్లించింది.