రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపే అవకాశం ఉంది. అయితే మంత్రి నుంచి గానీ, అధికారుల నుంచి గానీ తమకు ఎటువంటి సమాచారంలేదని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు చెప్పారు.
తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆమరణ దీక్ష ఐదో రోజుకు చేరిన విషయం తెలిసిందే. ఆమరణదీక్ష చేస్తున్నవారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈరోజు నుంచి అత్యవసర సేవలను నిలిపివేస్తామని సంఘం ప్రతినిధులు హెచ్చరించారు.