తమ డిమాండ్ల పరిష్కారానికి జూనియర్ డాక్టర్లు చేపడుతున్న ఆందోళన ఐదవ రోజుకు చేరుకుంది. నిరాహార దీక్ష చేస్తున్న వారి ఆరోగ్య పరిస్థితి క్షిణిస్తుంది. ప్రభుత్వం తమ ఆందోళనకు స్పందించక పోవడంతో జూడాలు తమ ఆందోళనను తీవ్రతరం చేస్తున్నారు. నేటి నుంచి అత్యవసర సేవలు నిలిపి వేస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు.