ముఖ్యమంత్రి రోశయ్య వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని చాలా నీరసంగా కనిపిస్తున్నారని వైద్యులు తెలిపారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి సూపరిండెంట్ డా.శుభాకర్ ఆధ్వర్యంలోని వైద్య బృందం...సీఎం కు వైద్య పరీక్షలు నిర్వహించింది. గతంలో రోశయ్య గుండె సంబంధ వ్యాధులతో ఇబ్బందులు పడటంతో..ఆ దిశగా కూడా వైద్యలు పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలకు సంబంధించిన ఫలితాలు.. ఈ సాయంత్రంలోగా వెలువడతాయని..ఫలితాల ఆధారంగా, సీఎం కు వైద్య సూచనలు చేస్తామని..డా.శుభాకర్ వెల్లడించారు. అయితే, సీఎం ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..ఆయన పేర్కొన్నారు.