పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు ‘ఖుషి’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘కొమరంపులి’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 22న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య చిరు బర్త్‌డేకి రిలీజ్ చేయలేక పోయారు. కాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు ఎస్.జె.సూర్య తెలిపారు. ఇక ఈ చిత్రంలో శ్రియ ఓ స్పెషల్ సాంగ్ చేయగా... నిఖిషా పటేల్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది.