తెలంగాణాలోని కరీంనగర్, వరంగల్ మరియు నిజామాబాదు జిల్లాలలో జిల్లా కలెక్టరేట్ల వద్ద ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్ధులు విద్య రంగం సమస్యలను పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగారు. విద్యార్ధులు కలెక్టరేట్ కార్యాలయాల్లోకి దూసుకు పోయేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీచార్జి, పలువురిని అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.