| |
సీఎంను కలిసిన అయ్యప్ప సొసైటీ బాధితులు |
| |
మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ బాధితులు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో కలుసుకున్నారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ కట్టడాలను కూల్చివేస్తున్నారని వారు ఈ సందర్భంగా సీఎంకు విన్నవించుకున్నారు. స్థానికులకు ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.
కాగా బడా బాబులు, సినీ ప్రముఖుల నిర్మాణాలపై కన్నెత్తి చూడని అధికారులు, సామాన్యులపై తమ ప్రతాపం చూపిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అక్రమ కట్టడాల కూల్చివేతలపై దృష్టి పెట్టారు
|
|
 |
|