| |
రాష్ట్రానికి మరిన్ని కేంద్ర బలగాలు |
| |
రాష్ట్రానికి త్వరలో మరో 24 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయి. తెలంగాణతోపాటు సీమాంధ్రలలోనూ ఉద్యమ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అదనంగా 50 కంపెనీల బలగాలు కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 76 కంపెనీల బలగాలున్నాయి. ఇప్పుడు మరో ఇరవైనాలుగు కంపెనీలను పంపేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో మూడు ప్రాంతాల్లోని సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించి అక్కడికి ఈ బలగాలను పంపుతున్నారు. తెలంగాణపై కేంద్రంలోని ప్రముఖులు విరుద్ధమైన ప్రకటనలు చేయడం, అధికార పార్టీలో అసంతృప్తుల నేపథ్యంలో ఏ క్షణమైనా శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో అదనపు బలగాలను రప్పిస్తున్నారు.
|
|
 |
|