శాసనసభ సమావేశాలు 5 రోజులపాటు నిర్వహించాలని శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బిఎసి) సమావేశంలో నిర్ణయించారు. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షుతన జరిగిన ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, శోభానాగి రెడ్డి, టీడీపీ నుంచి మోత్కుపల్లి నరసింహులు, గాలి
ముద్దుకృష్ణమ నాయుడు, అశోక్ గజపతిరాజు, ప్రభుత్వం నుంచి మంత్రి శ్రీధర్ బాబు, ఆనం రామనారాయణ రెడ్డి, ఇతర పార్టీల శాసనసభ పక్షనేతలు హాజరయ్యారు. ఫీజు రీయింబర్స్, విద్యుత్, వ్యవసాయం, కరువు అంశాలపై చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు. |