మంత్రులు, ఎమ్మెల్యేలు సహనంతో ఉండాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. ప్రజాజీవితంలో ఉన్నవారికి ఓర్పు అవసరమన్నారు. ఐఏఎస్ అధికారులప మంత్రి టీజీ వెంకటేష్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదన్నారు. ముసిరిమిల్లి ప్రాజెక్టు త్వరలో పూర్తిచేస్తామని చెప్పారు. సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఉపాధిహామిని వ్యవసాయంతో అనుసంధానం చేసే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని ముఖ్యమంత్రి వెల్లడించారు. |