ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా సంకల్పించిన 'ఇందిరమ్మ బాట'కు ప్రతికూల పవనాలు వీస్తూనే ఉన్నాయి. శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాలో ఇందిరమ్మ బాటకు బయల్దేరిన ముఖ్యమంత్రి వాతావరణం అనుకూలించకపోవటంతో శంషాబాద్ విమానాశ్రయంలో సుమారు గంటన్నర పాటు నిరీక్షించారు. విమానాశ్రయ అధికారులు అనుమతి ఇవ్వటంతో ఆయన తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు బయల్దేరారు.
కాగా ఇందిరమ్మ బాటకు ఆదిలోనే వర్షాల రూపంలో ఆటంకం ఎదురైంది. ఈనెల12వ తేదీ నుంచి ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నా, జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాయిదా పడింది. జిల్లాలో వర్షాలు కురుస్తుండటం, హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం అనుకూలంగా లేకపోవడంవంటి కారణాలరీత్యా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ చేసిన విజ్ఞప్తుల మేరకు రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం వాయిదా పడింది. |