మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుని పెళ్లి విందు కోసం విఆర్ఓ పరీక్ష కేంద్రాన్ని మార్చివేసి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు శాసనసభలో ఈ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాదరావు, చంద్రబాబు నాయుడుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. పెళ్లి విందు వల్ల చనిపోయిన బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
వెళ్లి విందు వల్ల పరీక్షా కేంద్రం రద్దు కాలేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు వివరణ ఇచ్చారు. పరీక్ష కంటే ముందే ఆ సెంటర్ని పెళ్లి విందుకు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారమే ఆ స్థలానికి ముందుగానే అనుమతి తీసుకున్నట్లు చెప్పారు. తప్పుని తనపై ఆపాదించినందుకు చంద్రబాబు నాయుడు తనకు క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. గట్టిగా మాట్లాడటం వల్ల తప్పుని ఒప్పుగా మార్చలేరని అన్నారు.