సర్కార్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేకుండా రైతులను మోసం చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వ్యవసాయం 50 శాతం లాభసాటిగా ఉండే విధంగా మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరువు ఖరీఫ్‌లో వస్తే రబీ సీజన్‌లో కేంద్ర బృందం పర్యటించడం వల్ల రైతులకు ఎటువంటి లాభం లేదని తెలిపారు. స్వామినాథన్ సిఫారసులను ఆమోదించి పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వ్యవసాయం లాభసాటి చేయాలన్నారు. 92 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతే ఎంత పరిహారం ఇవ్వాలో ప్రభుత్వం వద్ద లెక్కలు లేవని చెప్పారు. కేంద్రం నిధులు ఎక్కువగా రాష్ట్రానికి రాకున్న కూడా ఎంపీలు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు, ఎన్టీపీసీ, రైల్వే నిధుల్లో కేంద్రం కోతలు విధిస్తుందని తెలిపారు. కరువుపై ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలన్ని దిక్కులేకుండా పోయాయని పేర్కొన్నారు.