కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి యాకుబ్‌రెడ్డి కేసు ఘటనలో సీబీఐ విచారణపై ప్రభుత్వం సుప్రీం నుంచి స్టే ఎందుకు తెచ్చుకుందని జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం ప్రశ్నించారు. తప్పు చేయని ప్రభుత్వం తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. యాకుబ్‌రెడ్డి కేసు ఘటనలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త మంత్రులు ఎవరు తెలంగాణకు అనుకూలంగా లేరని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. మంత్రి పదవులు దక్కని మంత్రులు తెలంగాణపై డ్రామాలు ఆడటానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. అవినీతిపై యుద్ధం చేసే పార్టీలు ల్యాంకో అక్రమాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.