చంద్రబాబునాయుడుకు తెలుగు తమ్ముళ్లు షాక్ ఇచ్చారు. టీడీఎల్పీ సమావేశానికి మంగళవారం 90శాతం ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు. కేవలం పదిమంది మాత్రమే హాజరు కావటంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమావేశాన్ని రద్దు చేశారు. అనంతరం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం.