ప్రముఖ గాయని ఎస్.జానకి గాయపడ్డారు. తలకు గాయం కావడంతో.. ఆమెను తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. తిరుపతిలోని హోటల్ భీమాస్ బాత్‌రూమ్‌లో ఆమె జారిపడ్డారు. ఈ ఉదయం ఈ ఘటన జరిగింది. స్విమ్స్‌లో ఆమెకు MRI స్కాన్ తీశారు.
గాయం కారణంగా మెదడులో రక్తం గడ్డకట్టిందని సమాచారం. గాయకుడు బాలకృష్ణ ప్రసాద్ నిర్వహిస్తున్న అన్నమయ్య సంకీర్తనా మహాయజ్ఞంలో పాల్గొనేందుకు జానకి తిరుపతి వచ్చారు. 12 రోజులు పాటే జరిగే ఈ మహాయజ్ఞంలో ఇప్పటికే ఓసారి జానకి వచ్చి వెళ్లారు. మరోసారి పాల్గొనేందుకు ఆమె నిన్న తిరుపతి వచ్చారు.