ఐఎంజీ కుంభకోణానికి సంబంధించిన పాపమంతా చంద్రబాబుదేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపూడిప్రభాకరరావు ఆరోపించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జూపూడి, నల్లా సూర్యప్రకాశ్‌లు ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐఏఎస్‌లపై జరుగుతున్న సీబీఐ దర్యాప్తుపై సర్కార్ ఎందుకు స్పందించదు అని జూపూడిప్రశ్నించారు. నిర్ణయాలు తీసుకున్న మంత్రులు ఎందుకు తప్పించుకుంటున్నారని ఆయన అన్నారు.
అపధర్మ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. వ్యక్తిగా చంద్రబాబు ఒక్కరే నిర్ణయం ఎందుకు తీసుకున్నారని జూపూడిఅనుమానం వ్యక్తం చేశారు. తన నిర్ణయాన్ని కేబినెట్ సమిష్టి నిర్ణయంగా చంద్రబాబు చెప్పుకున్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఐఏఎస్‌లను బలి పశువులుగా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని జూపూడి ఆవేదన వ్యక్తం చేశారు.