గత కొంత కాలంగా ఉపకార వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న జూనియర్ డాక్టర్లతో మంత్రి శైలజానాథ్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూడాలు మొండిగా వ్యవహరిస్తున్నారని మంత్రి తెలిపారు. గతంలోనే 120 శాతం ఉపకార వేతనం పెంచామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఉపకార వేతనం పెంచే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. రూరల్ సర్వీస్ తప్పని సరిగా చేయాలని జూడాలకు చెప్పానని ఆయన తెలిపారు.