బోధనా రుసుములు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇంజనీరింగ్ కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చిన యాజమాన్యాలు వెనక్కి తగ్గాయి. బకాయిలు చెల్లించకపోతే కళాశాలలను మూసివేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం దిగివచ్చింది. బోధనా రుసుముల కింద రూ. 1200 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. మార్చి లోగా పూర్తి బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. మంగళవారం నుంచి జరిగే పరీక్షలు యధాతథంగా ఉంటాయని కళాశాలల యాజమాన్యాలు పేర్కొన్నాయి.