అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో మంత్రివర్గ కూర్పుకు కసరత్తు మొదలైంది. దాంతో సోమవారం ఉదయం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి ఆశావహులు క్యూ కట్టారు. తెలంగాణ ప్రాంతానికి ఈసారి అవకాశమని తేలడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎమ్మెల్యేలు సీఎంను కలుస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రితో భట్టి విక్రమార్క, గండ్ర వెంకటరమణారెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి తదితరులు భేటీ అయ్యారు.